Palamaner: రూ.9 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎమ్మెల్యే అమరనాథ

Palamaner: పలమనేరులో రూ.9 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, ఎంపీ ప్రసాద్ రావు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పూజల పిలుపు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 12 Sept 2026 4:44 PM IST
Palamaner
X

Palamaner: రూ.9 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎమ్మెల్యే అమరనాథ

పలమనేరు: ఎన్నికలకు ముందుమాట ఇచ్చాం నేను అభివృద్ధి చేసి చూపామంటూ పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. పలమనేరు పట్టణంలోని గొబ్బిళ్ళకోటూరు, టెర్రకోట కాలనీ, గంటావూరు ఇందిరమ్మ, వైయస్సార్,బీసీ కాలనీలల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావుతో కలిసి శనివారం పర్యటించారు.

ఈ సందర్భంగా సుమారు 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వారు చేపట్టారు. గంటావూరు కాలనీ వాసులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. తమకు ఓట్లు వేసిన వేయకపోయినా అభివృద్ధిని మాత్రం చేసి చెబుతామని పేర్కొన్నారు.

రోడ్లు, డ్రైన్లు,విద్యుచ్చక్తి మరియు నీరు ఇలా అన్ని మౌలిక సదుపాయాలను అందించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చేసేవారినే ప్రజల ఆదరించి పట్టం కట్టాలని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ కార్యక్రమాలు చేసిన ఘనత తమ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. ఇక ఆర్డిఎస్ఎస్ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరం లాంటిదని దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటికో పారిశ్రామికవేత్తను చేయడమే చంద్రబాబుదేయమని అందులో భాగంగా 24 గంటలు త్రీఫేస్ కరెంటును ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు చేరువ చేస్తున్నదని కాబట్టి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను వారు పంపిణీ చేస్తూ వివరించారు.

మట్టి వినాయకులనే పూజిద్దాం

వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులని పూజిద్దామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. టెర్రకోట కళాకారులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేసి ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రభుత్వం సైతం వినాయక మండపాల ఏర్పాటుకు ఉచిత విద్యుత్ ను మరియు ఉచితంగా చెత్త తరలింపును చేపట్టే కార్యక్రమాలను చేస్తోందని తెలియజేశారు.

కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో కూటమి నాయకులు ఆర్ వి బాలాజీ, రాజన్న, సుబ్రహ్మణ్యం గౌడు, కుట్టీ, గిరిబాబు, శ్రీధర్, ఖాజా, నాగరాజు, చాంద్ భాషా, మదన్, చెంగప్ప, కృష్ణమూర్తి గౌడు తదితరులు పాల్గొన్నారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU