Palamaner: పండుగ వాతావరణంలో ఘనంగా మహానాడు
Palamaner: పలమనేరు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరిగిన టీడీపీ మహానాడు. 10 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో సదస్సు విజయవంతం.
Palamaner: పండుగ వాతావరణంలో ఘనంగా మహానాడు
పలమనేరు: నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ౧౦ క్లస్టర్‌ల పరిధిలో వర్చువల్ విధానంలో సాగిన ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి అనితా దీప్తి హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలుగుజాతి ప్రగతి మరియు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా పార్టీ బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరిగే మహానాడు పసుపు సైన్యానికి ఓ పండుగ అని ఆమె పేర్కొన్నారు.
ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా మహానాడును కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు మేరకు ఈసారి వర్చువల్ రూపంలో నిర్వహించాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారన్నారు. ఈసారి విన్నుత్నంగా మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ మహానాడు కార్యక్రమం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే గొప్ప వేదిక అని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో క్లస్టర్ ఇంచార్జిలు సి.రామచంద్ర నాయుడు, బ్రహ్మయ్య, మురహరి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, భాస్కర్ రెడ్డి, జీ.రామచంద్ర నాయుడు, మంజునాథ్, పలని వేలు, నారాయణస్వామిలతో పాటు యూనిట్ ఇన్చార్జులు మరియు పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




