Palamaneru: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

Palamaneru: చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు ఘనం.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 28 May 2026 2:11 PM IST
Palamaneru
X

Palamaneru: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

పలమనేరు: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఆర్వీ బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబులు మాట్లాడుతూ.. తెలుగు జాతి గౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో గర్వంగా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదలు, బీసీలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సామాన్య ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి నాయకుల్లో ఎన్టీఆర్ ఒకరని, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో వారి అభివృద్ధికి బాటలు వేసారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టీడీపీ నాయకులు కుట్టి,నాగరాజు, మదన్, శ్రీధర్, కిరణ్, అమరనాథ రెడ్డి, సుధాకర్,మురళీ, సోమశేఖర్, లోకేష్, శ్రీనివాసులు,చిన్ని,కిషోర్, వెంకటరమణ మరియు మహిళా నాయకురాలు పర్వీన్,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story