Palamaneru: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి వెంకటెగౌడ
Palamaneru: పలమనేరులో వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.
Palamaneru: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి వెంకటెగౌడ
పలమనేరు: మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ ఇంచార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ వెంకటే గౌడ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీ అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయడంతో పాటు, ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు, ఈ నెల 10న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
యువత, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.




