Kothakota: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బి.కొత్తకోటలో ప్రత్యేక ప్రార్థనలు!

Kothakota: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో శివాలయం దర్గాలో జనసేన కార్యకర్తల ప్రత్యేక పూజలు.

Srinivasulu, Madanapalle
Published on: 13 July 2026 1:53 PM IST
Kothakota
X

Kothakota: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బి.కొత్తకోటలో ప్రత్యేక ప్రార్థనలు!

Kothakota: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బి.కొత్తకోటలోని శివాలయంలో పవన్ కళ్యాణ్ పేరుమీద అభిషేకం, అర్చన, పుష్పాలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యవంతులై ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా కొనసాగాలని కోరుతూ హిందూ, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గ నాయకుడు పోతుల సాయినాథ్‌ తో పాటు బి.కొత్తకోట మండలానికి చెందిన పగడాల ప్రసాద్ బాబు, చింతల కిరణ్ రాయల్, శేఖర్ రాయల్, పూల శ్రీనివాస్, ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, గౌతమ్, చందు రాయల్, రామాంజి, వికటకవి నాగేంద్ర, నరేంద్ర, షేకర్ భాష, సయ్యద్, వెంకీ, ఆవుల శ్రీనివాస్, వీరమహిళలు ప్రభావతి, ప్రత్యూష, ఏపిటీఎం మండల నాయకులు డి.శంకర్, ఏ.దేవేంద్రతో పాటు జనసైనికులు, పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story