Chittoor: డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి

Chittoor: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరులో జరుగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.

Chandra Sekhar, Chittoor
Published on: 7 Aug 2026 5:32 PM IST
Chittoor
X

Chittoor: డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి

చిత్తూరు: ఇంచార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.మంత్రి నారా లోకేష్ స్థాయి వ్యక్తులు డబ్బులు తీసుకుని నియామకాలు జరిపారని ఆరోపణలు రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.గతంలో వైఎస్ జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణను ఆహ్వానించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం సాక్ష్యాధారాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకేష్‌ను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు.కేంద్రమంత్రి తరహాలోనే మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదో తేదీన నిర్వహించే ర్యాలీతో డీఎస్సీ అక్రమాలు తెరమరుగవుతాయని లోకేష్ భావిస్తే అది మూర్ఖత్వమని అన్నారు.లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న శిబిరంపై బొండా ఉమా దాడి చేయడం హేయమైన, రాక్షస చర్య అని ఆయన మండిపడ్డ

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story