Madanapalle: ఆత్మీయ వాతావరణంలో ఉదయ్‌కుమార్ గృహప్రవేశ వేడుక
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మాజీ జడ్పీటీసీ ఉదయ్‌కుమార్ నూతన గృహప్రవేశ వేడుక వైభవంగా జరిగింది.
Madanapalle: ఆత్మీయ వాతావరణంలో ఉదయ్‌కుమార్ గృహప్రవేశ వేడుక
మదనపల్లె: మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి, మదనపల్లె సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజా రెడ్డి, అంగన్వాడీ వింగ్ అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ శారదా రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఉదయ్‌కుమార్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గృహప్రవేశ వేడుక ఆత్మీయ వాతావరణంలో సాగగా, స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన గృహంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.




