Chittoor: ఘనంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం!
Chittoor: చిత్తూరు కొంగారెడ్డిపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం.
Chittoor: చిత్తూరులో ఘనంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం!
Chittoor: చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ ఘనంగా నిర్వహించారు. భారీగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఐదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ హరిణి రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని విజయనంద రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీకి జిల్లా పెద్దాయనగా అందరికీ ఆదర్శంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలిచారన్నారు. పార్టీకి కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు




