Chittoor: అంగస్తంభన సమస్యకు పెనైల్ ఇంప్లాంట్లతో పరిష్కారం!
Chittoor: పురుషుల్లో అంగస్తంభన సమస్యకు పెనైల్ ఇంప్లాంట్లతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
Chittoor: అంగస్తంభన సమస్యకు పెనైల్ ఇంప్లాంట్లతో పరిష్కారం!
Chittoor: పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ఆధునిక వైద్య విధానాల్లో పెనైల్ ఇంప్లాంట్ సమర్థవంతమైన చికిత్సా మార్గంగా నిలుస్తోందని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు దాటిన పురుషుల్లో అంగస్తంభన సమస్య సాధారణంగా కనిపిస్తోందని, మధుమేహం,రక్తనాళాల సమస్యలు వంటి కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంగస్తంభన సమస్యను కేవలం లైంగిక సమస్యగా చూడకుండా, గుండె సంబంధిత వ్యాధులకు ముందస్తు సంకేతంగా కూడా పరిగణించాలని సూచించారు.సాధారణ మందులు, ఇతర చికిత్సలతో ఆశించిన ఫలితాలు లభించని వారికి పెనైల్ ఇంప్లాంట్ ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ పరికరాన్ని శస్త్రచికిత్స ద్వారా శరీరం లోపల అమర్చుతారని, బయటకు కనిపించదని వివరించారు.
ఆధునిక ఇంప్లాంట్లతో ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు.అంగస్తంభన సమస్యతో బాధపడేవారు సంకోచించకుండా వైద్యులను సంప్రదించి, సరైన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు.




