Srikalahasti: మెగా కార్డన్ సెర్చ్: సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్!
Srikalahasti: శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు నిర్వహించిన మెగా కార్డన్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 78 బైక్‌లు, 12 ఆటోలను సీజ్ చేశారు.
Srikalahasti: మెగా కార్డన్ సెర్చ్: సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్!
Srikalahasti: తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో శనివారం మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) మరియు శ్రీకాళహస్తి సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అసంపూర్తి పత్రాలతో ఉన్న వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం సీజ్ చేశారు.
అనంతరం ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా రాజీవ్ నగర్ కాలనీ ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన, మహిళా భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.




