B Kothakota: బి.కొత్తకోటలో శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ప్రజా దర్బార్’!
B Kothakota: బి.కొత్తకోటలో తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్ జి.శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్.. 6 మండలాల అధికారులతో ప్రజా సమస్యలపై సమీక్ష.
B Kothakota: బి.కొత్తకోటలో శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ప్రజా దర్బార్’!
B Kothakota: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో బి.కొత్తకోట మండలం రాజా ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ జి. శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్‌లో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జి శంకర్ అధికారులను కోరారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇటువంటి ప్రజా దర్బార్‌లను నిర్వహిస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.




