Pulicherla: రామిరెడ్డిగారిపల్లెలో ఘనంగా 51వ ఆడికృత్తిక మహోత్సవాలు

Pulicherla: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రామిరెడ్డిగారిపల్లె శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 51వ ఆడికృత్తిక ఉత్సవాలు. సందర్శించిన వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డి.

Srinivasulu, Madanapalle
Published on: 7 Aug 2026 3:11 PM IST
Pulicherla
X

Pulicherla: రామిరెడ్డిగారిపల్లెలో ఘనంగా 51వ ఆడికృత్తిక మహోత్సవాలు

పులిచెర్ల: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రామిరెడ్డిగారిపల్లె గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో 51వ ఆడికృత్తిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఆగస్టు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్వామివారి విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా మదనపల్లె వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఆలయాన్ని సందర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులు, యువత, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

102వ జాతీయ రహదారిపై ఉన్న ఈ దేవస్థానానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story