Punganur: బక్రీద్ పండుగపై అఖిల భారత గోరక్ష మహా సంఘ్ కీలక ప్రకటన
Punganur: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, చట్టాలను గౌరవిస్తూ జరుపుకోవాలని అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు.
Punganur: బక్రీద్ పండుగపై అఖిల భారత గోరక్ష మహా సంఘ్ కీలక ప్రకటన
Punganur: దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంలో గోవుల పాత్ర అమూల్యమైనదని, అత్యంత పవిత్రమైనదని అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. పశుసంపదను, గోవుల పవిత్రతను కాపాడుకోవడానికి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ మరియు సంరక్షణ చట్టం 1977 ను ప్రభుత్వ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంలో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు డా. పి. అయూబ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన మరియు హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేశారు.
Next Story




