Punganur: పుంగనూరులో టీడీపీలోకి భారీగా చేరిన ఫ్రూట్ మర్చంట్ సభ్యులు!

Punganur: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చాందు ఆధ్వర్యంలో పలువురు సభ్యులు టీడీపీలో చేరారు.

MAHESH, PUNGANOOR
Updated on: 13 Nov 2026 5:15 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో టీడీపీలోకి భారీగా చేరిన ఫ్రూట్ మర్చంట్ సభ్యులు!

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు గారి నాయకత్వం, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఫ్రూట్ ప్రెసిడెంట్ చాందు గారి ఆధ్వర్యంలో పర్వేజ్, నౌషాద్, సయ్యద్, నూర్, అబ్దుల్, జబ్బార్, రియాజ్, రఫీక్, బావాజాన్, షావలీ, జాఫర్, మహబుబ్ అలీ, బుడ్డు, అష్రఫ్, అయుబ్, రఫీక్, సఇద్, అహ్మద్, విజయ్, ఇర్షాద్, వరాలు, బాబా, సైఫుల్లా, కదిర్, నూరుల్లా, దావుద్, ఫజల్ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, మధుసూదన్ నాయుడు గారి నాయకత్వంలో పుంగనూరులో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. మధుసూదన్ నాయుడు గారు నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR