Punganur: పుంగనూరు వివేకానంద నగర్‌లో రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ మురుగు!
Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ మురుగు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Punganur: పుంగనూరు వివేకానంద నగర్‌లో రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ మురుగు!
పుంగనూరు: పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యం కారణంగా సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోందని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు.




