Punganur: పుంగనూరులో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్!
Punganur: పుంగనూరులో డీఎస్సీ 2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీబీఐ విచారణ జరిపించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
Punganur: పుంగనూరులో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్!
Punganur: డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ.
మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు
కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి. పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు.
వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు.పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ,విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్చేస్తున్నమన్నారు.
గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు.
డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి,యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.




