Puthalapattu: మొరంపల్లిలో నూతన పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Puthalapattu: పూతలపట్టు మండలం మొరంపల్లి బీసీ కాలనీలో చిన్నారి విద్యార్థుల కోరిక మేరకు నూతన పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్.

VASU, PUTTALAPATTU
Published on: 4 Aug 2026 4:48 PM IST
Puthalapattu
X

Puthalapattu: మొరంపల్లిలో నూతన పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

పూతలపట్టు: విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. చదువుకునే చిన్నారి విద్యార్థుల కోరికను నెరవేర్చిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరంపల్లి బీసీ కాలనీలో 21 మంది చిన్నారి విద్యార్థులు బడికి వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవారు. 15 సంవత్సరాలుగా మొరంపల్లి నుండి పక్క గ్రామానికి వెళ్లే చదువుకోవాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో యుద్ధ ప్రాతిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహాయ సహకారాలతో ఒకటవ తరగతి నుండి, ఐదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల కోసం నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొరంపల్లి బీసీ కాలనీవాసులు కుటుంబ పోషణ నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకుని జీవించేవారు ఉన్నారు. వీరి పిల్లలకు చదువుకునేందుకు వాళ్ల ఊరిలోనే బడి ని ఏర్పాటు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ఎంఈఓ రుశేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story