Puthalapattu: తిమ్మిరెడ్డిపల్లిలో దున్నపోతు బలి నిలిపివేసిన కలెక్టర్!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి జాతరలో దేవర దున్నపోతు బలిని అధికారులు అడ్డుకున్నారు.
Puthalapattu: తిమ్మిరెడ్డిపల్లిలో దున్నపోతు బలి నిలిపివేసిన కలెక్టర్!
పూతలపట్టు: దేవర దున్నపోతును బలిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు. పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డి పల్లి గ్రామానికి దళితవాడ చెందిన కొంతమంది యువకులు ఫిర్యాదు. పోలీసులు,రెవెన్యూ సిబ్బంది దేవర దున్నపోతుకు కాపలా. గ్రామంలో జాతర సందర్భంగా నడివీధిలో అమ్మవారికి కుంభం పెట్టి దున్నపోతును బలివ్వడం ఆచారం.
50వేల రూపాయలు ఖర్చుపెట్టి దున్నపోతుని గ్రామానికి తీసుకొచ్చిన గ్రామస్తులు. దీని గమనించిన కొందరు స్థానికులు కట్టి ఉంచిన దున్నపోతు ఫోటోలు తీసి ఢిల్లీలోని కేంద్ర పశుసంవర్ధ శాఖ కార్యాలయానికి సమాచారం. తిమ్మిరెడ్డి పల్లి లో జాతర పేరిట మూగ జీవాలను బలిస్తున్నారని దానిని అడ్డుకోవాలని మెసేజ్ చేసిన స్థానిక యువకులు.
ఈ విషయాలు ఏమీ తెలియని గ్రామస్తులు అమ్మ వార్లుకు ఆలయంలో వద్ద భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు. ఈ జాతరకు వచ్చిన బంధువులు చుట్టుపక్కల గ్రామస్తులు వారితో సందడి. ఈలోపు ఢిల్లీలోని పశువర్ధశాఖ ఉన్నత అధికారులు స్పందించారు. ఈ బల్లి ని అడ్డుకోవాలంటూ చిత్తూరు కలెక్టర్కు ఆదేశాలు జారి.
పూతలపట్టు తాసిల్దార్ కు ఉదయ్ సతీష్ కి కలెక్టర్ సుమిత్ కుమార్ ఫోను. తిమ్మిరెడ్డి పల్లెలో దున్నపోతు బలిని ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. అప్రమిత్తమైన పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది.
దేవర దున్నపోతుకు రాత్రంతా కాపలా. 40 సంవత్సరాల తర్వాత గ్రామ బాగుండాలని ఉద్దేశంతో తాము దున్నపోతును బలివాలనుకుంటున్నామని అధికారులకు గ్రామస్తులు విన్నపము. ఏది ఏమైనా బలి ఇవ్వరాదని అధికారులు హుకుం జారీ.
తెల్లవారుజామున 3 గంటలకు బలి ఇవ్వాల్సిన దున్నపోతును బలిబలి ఆపి,కుంభం వేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఏ సమయంలో అయినా దున్నపోతు బలి ఇస్తారని భావనతో పోలీసులు రెవిన్యూ సిబ్బంది రాత్రి 10 నుంచి ఉదయం ఏడు గంటల వరకు దేవర దున్నపోతుకు కాపలాగా ఉన్నారు.




