Puthalapattu: గంగవరపు గోపి దంపతుల నూతన గృహప్రవేశ వేడుక

Puthalapattu: పూతలపట్టులో టీడీపీ నాయకులు గంగవరపు గోపి దంపతుల నూతన గృహప్రవేశానికి వెళ్లిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులను ఆశీర్వదించారు.

VASU, PUTTALAPATTU
Published on: 29 Aug 2026 11:03 PM IST
Puthalapattu
X

Puthalapattu: గంగవరపు గోపి దంపతుల నూతన గృహప్రవేశ వేడుక

పూతలపట్టు: పూతలపట్టు మండలంలోని లక్ష్మయ్య ఊరుకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకులు, క్లస్టర్, ఇంచార్జ్ మాజీ ఎంపీటీసీ గంగవరపు గోపి, తేజశ్రీ దంపతుల నూతన గృహప్రవేశ మహోత్సవం సోమవారం ఉదయం అత్యంత వైభవంగ జరగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గంగవరపు గోపి నూతన గృహానికి వెళ్లి దంపతులను ఆశీర్వదించారు.

"ఇన్నాళ్లుగా మీ కష్టంతో కలలుగన్న సొంత ఇంటిని సాధించిన ఈ శుభసమయంలో.. నూతన గృహంలో అడుగుపెడుతున్న మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఈ నూతన గృహం మీకు అష్టైశ్వర్యాలను, సంతోషాన్ని, శాంతిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటా నన్నారు . పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ నూతన గృహప్రవేశ దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్లు దొరబాబు చౌదరి, గంగారపు హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి, ధరణి నాయుడు, మొరార్జీ యాదవ్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story