Chittoor: టీడీపీ జిల్లా కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష!
Chittoor: టీడీపీ ఆఫీసు సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్, జిల్లా ప్రెసిడెంట్ షణ్ముగ రెడ్డి పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Chittoor: టీడీపీ జిల్లా కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష!
చిత్తూరు: ఈరోజు చిత్తూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ షణ్ముగ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ముఖ్యమైన జిల్లా స్థాయి పార్టీ సమావేశానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, మరియు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రగతికి ఎమ్మెల్యే గారు నిరంతరం శ్రమిస్తూ, జిల్లా నాయకత్వంతో కలిసి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
Next Story




