Puthalapattu: పూతలపట్టులో రూ.6.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

Puthalapattu: బంగారుపాళ్యం మండలంలో రూ.6.20 కోట్ల వ్యయంతో పూర్తయిన రోడ్లు, పాఠశాల భవనాలు, హెల్త్ క్లినిక్‌లను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు.

VASU, PUTTALAPATTU
Published on: 10 Oct 2026 5:10 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టులో రూ.6.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

Puthalapattu: కూటమి ప్రభుత్వముతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. 6.20 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్.

కూటమి ప్రభుత్వ సారథ్యంలో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే శరవేగంగా అభివృద్ధి పనులు చేయించారు. బంగారుపాళ్యం మండలంలో రూ. 6.20 కోట్ల భారీ వ్యయంతో పూర్తయిన పలు కీలక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

రూ. 4.50 కోట్లు: బి.ఎల్. కండ్రిగ నుండి దెగలబండ వరకు సరికొత్తగా నిర్మించిన బీటీ (BT) రోడ్డు ప్రారంభం. రూ. 1.10 కోట్లు (110.25 లక్షలు): నలగాంపల్లి ఎన్టీఆర్ (NTR) హౌసింగ్ కాలనీలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం.

రూ. 25 లక్షలు: కీరమండ ZPHS ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం అదనంగా నిర్మించిన తరగతి గదుల (ACR) భవనం ప్రారంభం. రూ. 12 లక్షలు: కోడలమడుగు గ్రామంలో ప్రజల చెంతకు వైద్యాన్ని చేర్చేలా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ (గ్రామీణ ఆరోగ్య కేంద్రం) భవనం ప్రారంభం. రూ. 5 లక్షలు: కోడలమడుగు గ్రామంలో కొత్తగా వేసిన అంతర్గత సీసీ (CC) రోడ్డు ప్రారంభం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాల్లో రవాణా, విద్య, వైద్య మరియు గృహ నిర్మాణ రంగాల్లో మౌలిక సదుపాయాల కొరత లేకుండా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ నాయుడు, బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ధరణి ధర నాయుడు, జిల్లా తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU