Puthalapattu: పూతలపట్టు-కలికిరి కొండ రహదారి పనులపై టీటీడీ చైర్మన్ హామీ!
Puthalapattu: పూతలపట్టు నుండి కలికిరి కొండ రహదారి నిర్మాణం కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ఎమ్మెల్యే మురళీమోహన్, దొరబాబు చౌదరి వినతిపత్రం అందజేత.
Puthalapattu: పూతలపట్టు-కలికిరి కొండ రహదారి పనులపై టీటీడీ చైర్మన్ హామీ!
Puthalapattu: పూతలపట్టు నుండి కలికిరి కొండ వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్ గారు, మన లెజెండ్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొరబాబు చౌదరి గారు, సీనియర్ నాయకులు శ్రీ చంద్రమౌళి గారు ఐరాల సీనియర్ నాయకులు గిరి నాయుడు గారు Ex ZPTC బాబు రావ్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ ప్రతిపాదనపై చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారు సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే రహదారి పనులకు ఆమోదం (Sanction) కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే భక్తులకు, స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.
ఇట్లు
పెద్ద పాల్యం నాగరాజ్
పూతలపట్టు నియోజకవర్గం




