Puthalapattu: ఈ-ఆటోలు పంపిణీ చేసిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Puthalapattu: యాదమరి ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఈ-ఆటోలను పంపిణీ చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.

VASU, PUTTALAPATTU
Published on: 22 Aug 2026 6:23 PM IST
Puthalapattu
X

Puthalapattu: ఈ-ఆటోలు పంపిణీ చేసిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

పూతలపట్టు: పూతలపట్టు నియోజకవర్గ, యాదమరి ఎంపీడీవో కార్యాలయం ఆవరణములో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్, ఈ ఆటో పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛందంగా తీర్చిదిద్దే విధముగా అందరి దగ్గర ప్రమాణం చేయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు గారు పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేసి, ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఆటోలు పారిశుద్ధి కార్మికులకు చాలా సులభతరముగా ఉంటుందన్నారు.

ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ఇంటి చుట్టూ గాని, వీధుల్లో గాని చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయరాదని, నిర్దిష్టమైన ప్రదేశంలో చెత్తను ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తీసుకెళ్లడానికి సులభతరంగా ఉంటుందని ప్రజలకు సూచించారు.

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పరిసర పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్ మొరాజ్ యాదవ్, సింగల్ విండో చైర్మన్ చిత్ర నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకులు అమర్నాథ్ నాయుడు, జిల్లా నాయకులు కోదండ యాదవ్, మండల అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story