Puthalapattu: 550 ఓట్లున్న తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీకి 11 మంది నామినేషన్లు!

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీలో కేవలం 550 ఓట్లు మాత్రమే ఉండగా ఏకంగా 11 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.

VASU, PUTTALAPATTU
Published on: 21 Nov 2026 5:24 PM IST
Puthalapattu
X

Puthalapattu: 550 ఓట్లున్న తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీకి 11 మంది నామినేషన్లు!

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమిరెడ్డిపల్లి పంచాయతీ నందు 550 ఓట్లు ఉండగా 11 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. పైగా ఎస్సీ రిజర్వేషన్ కలిగినపంచాయతీ. పంచాయతీ నందు ఎనిమిది వార్డులు ఉన్నవి. గ్రామ పెద్దలు మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి వివిధ రంగాలలో తగిన ప్రాధాన్యత కల్పించారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తిమ్మిరెడ్డి పల్లి పంచాయతీలో తిమ్మిరెడ్డి పల్లి, పాపి నాయన పల్లి రెండు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన 550 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియ మొదలుకొని సర్పంచి దరాకాస్తులు పరిశీలన రోజు వరకు కూడా సర్పంచ్ అభ్యర్థులు ఎవరు తమ నిర్ణయాలు తెలపకపోవడంతో 11 మంది అభ్యర్థులు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు.

ఇరు గ్రామాలకు సంబంధించిన పెద్దలు 11 మంది సర్పంచ్ అభ్యర్థులకు నచ్చ చెప్పాలని చూసిన వారి ప్రయత్నం ఫలించలేదు. గ్రామ పెద్దలు ఎంత ప్రయత్నించిన వారి మాట వినలేదని ప్రభుత్వం నుండి పంచాయతీ అభివృద్ధికి వచ్చే నిధులు అనవసరంగా వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తిమ్మిరెడ్డి పల్లి పంచాయతీ నందు త్రాగినీరు, పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ కాలవలు, విద్యుత్ దీపాలు మొదలగు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా పంచాయతీ సర్పంచికి 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం చాలా విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోయారు. అంబేద్కర్ ఆశయాలు కాపాడు వలసిన వారే పౌరుషాలకు వెళ్లి అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని అలా కాకుండా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీ ప్రజలు కోరారు.

తిమ్మిరెడ్డి పల్లి పంచాయతీ గ్రామాల నందు ప్రజలు అన్నదమ్ములుగా ఉండవలసిన వారు సర్పంచి ఎన్నికల వలన మనస్పర్ధలు పెరిగి ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఏకమై ఏకగ్రీవంగా ఉందామని పంచాయతీ ప్రజలందరూ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU