Puthalapattu: గుడి కన్నా బడి మిన్న.. పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం
Puthalapattu: "గుడి కన్నా బడి మిన్న" అనే ఆశయంతో పూతలపట్టు మండలం తలపులపల్లి జెడ్పీ హైస్కూల్‌కు దాత రాజేంద్రప్రసాద్ రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
Puthalapattu: గుడి కన్నా బడి మిన్న.. పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం
Puthalapattu: పూతలపట్టు మండలం, తలపులపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణము, పాఠశాల ఆర్చి, గేటు నిర్మాణానికి సుమారు 5 లక్షల రూపాయల పైబడి పెట్టుబడి పెట్టి స్కూలు విద్యార్థుల సౌకర్యాలకు తన వంతు సహాయ సహకారాలు అందించిన దాత రాజేంద్రప్రసాద్ వైఎస్ఆర్సిపి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తలపులపల్లి బాబు రెడ్డి మాట్లాడుతూ దాత రాజేంద్రప్రసాద్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం దాత మాట్లాడుతూ గుడి కన్నా బడి మిన్న అన్న అభిప్రాయంతో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




