Chittoor: పూతలపట్టు ZPTCగా నియామక ఫారం-10 అందుకున్న శైలజ!
Chittoor: పూతలపట్టు ZPTCగా ఏకగ్రీవమైన టీడీపీ అభ్యర్థి శైలజ కలెక్టర్ సుమిత్ కుమార్ నుండి ఫారం-10 అందుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ హర్షం తెలిపారు.
Chittoor: పూతలపట్టు ZPTCగా నియామక ఫారం-10 అందుకున్న శైలజ!
Chittoor: పూతలపట్టు జడ్పిటిసి సభ్యురాలు గా ఏకగ్రీవంగా ఎన్నికైన టిడిపి అభ్యర్థి శైలజ తేజ మూర్తి బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ఫారం -10 ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
శైలజ తేజోమూర్తి ఏకగ్రీవంతో టిడిపి శ్రేణులు, మద్దతుదారుల లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం పరంపర కొనసాగుతుందని, సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ విజయానికి కారణమన్నారు.




