Puttur: ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.. పుత్తూరులో ధర్నా

Puttur: పుత్తూరులో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో భారీ ధర్నా.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 May 2026 9:52 PM IST
Puttur
X

Puttur: ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.. పుత్తూరులో ధర్నా

Puttur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏఐటియుసి రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరికించింది.ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు ఎన్. శివ ఏరియా కార్యదర్శి చంద్రబాబు. మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన APSRTC ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రైవేటీకరణ వల్ల టికెట్ ధరలు అమాంతం పెరిగి,గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయే ప్రమాదం ఉంది.

లాభం లేని రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడపరు.50వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి భంగం కలుగుతుంది వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.90 ఏళ్లుగా ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న డిపోలు,బస్సులు,బస్టాండు. మరియు ఆర్టీసీ ఆస్తులు పై కన్నేసిన కార్పొరేట్ శక్తుల పరం కావడం అన్యాయం అన్నారు.APSRTC లాభాల్లో నడుస్తున్న రాష్ట్రాల్లో మనది ఒకటి. నష్టాల పేరుతో ప్రైవేటీకరించడం సరికాదు. నష్టాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప,సంస్థను అమ్మేయడం పరిష్కారం కాదు.

(APSRTC )ప్రైవేటీకరణ ప్రతిపాదనను తక్షణమే పూర్తిగాఉపసంహరించుకోవాలి. సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలి. కార్మిక సంఘాలతో చర్చించి, ఉద్యోగుల భద్రతకు హామీ ఇవ్వాలి. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు బాబు, సిపిఐ కార్యదర్శి డి.మహేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం రామకృష్ణ, నాగరాజు,ఏఐటియుసి అధ్యక్షులుటి. గోపి, వెంకటరమణ, కృష్ణారెడ్డి, భాస్కర్, రవి, కైలాసం తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story