Puttur: పుత్తూరులో ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం
Puttur: పుత్తూరు మున్సిపాలిటీ 7వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ వివరించిన వైనం.
Puttur: పుత్తూరులో ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం
పుత్తూరు: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం... అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పుత్తూరు మున్సిపాలిటీ 7వ వార్డు (గేట్ పుత్తూరు ) నందు రెండేళ్ల నమ్మకంతో అభివృద్ది సంక్షేమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. వార్డులో ఇంటింటికీ వెళ్లి కర్రపత్రాలను అందించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యకమాలను వివరించిన , ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.
ఈ సందర్బంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు సూచనలు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నచిన్న గ్రామాల్లోనూ, మున్సిపాలిటీ వార్డుల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది..వైసీపీ పాలనలో ఒక్క బిడ్డకే పరిమితమైంది. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేలు పొందుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి 16 వేల పోస్టులు భర్తీ చేశారు. త్వరలో మరో డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు.




