Boyakonda: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు!
Boyakonda: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించిన ఈవో.
Boyakonda: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు!
బోయకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ తల్లిని రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్ మోహన్ రాజు గారికి, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట టౌన్ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, వైస్ ఏఎంసి చైర్మన్ కర్ణాటకం చెంగల్ రాయుడు, సీనియర్ నాయకులు కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వీరబల్లి మండల నాయకులు పాల్గొన్నారు.
Next Story




