Ramasamudram: రామసముద్రం ఏపీ మోడల్ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా చెన్నకేశవులు
Ramasamudram: రామసముద్రం ఏపీ మోడల్ స్కూల్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. చైర్మన్‌గా చెన్నకేశవులు, వైస్ చైర్మన్‌గా రూపా ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
Ramasamudram: రామసముద్రం ఏపీ మోడల్ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా చెన్నకేశవులు
రామసముద్రం: మండలంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎస్‌ఎంసీ చైర్మన్‌గా చెన్నకేశవులు, వైస్ చైర్మన్‌గా రూపా ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తే పాఠశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ తెలిపారు.




