Ramasamudram: 18వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

Ramasamudram: రామసముద్రంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 18వ రోజుకు చేరింది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్.

Srinivasulu, Madanapalle
Published on: 3 Oct 2026 7:50 PM IST
Ramasamudram
X

Ramasamudram: 18వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

రామసముద్రం: తమ సమస్యల పరిష్కారం కోసం రామసముద్రం మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 18వ రోజుకు చేరుకుంది.

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ వీఆర్ఏలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. తమ సమస్యలను పలుమార్లు అధికారుల, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం లభించలేదన్నారు.

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle