Punganur: రేషన్ బస్తాల క్యూఆర్ కోడ్ స్కానింగ్ రద్దు చేయాలని డీలర్ల వినతి
Punganur: రేషన్ బస్తాలకు నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం వల్ల తీవ్ర పనిభారం కలుగుతోందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ రేషన్ డీలర్ల సంఘం.
Punganur: రేషన్ బస్తాల క్యూఆర్ కోడ్ స్కానింగ్ రద్దు చేయాలని డీలర్ల వినతి
పుంగనూరు: రేషన్ బస్తాలకు నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం వల్ల తీవ్ర పనిభారం, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ 'ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం' ప్రతినిధులు స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సెప్టెంబరు నుండి పంపిణీ చేసే రేషన్ బస్తాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలనే నిబంధన తెచ్చారని, అయితే చాలామంది డీలర్ల వద్ద ఆండ్రాయిడ్ మొబైళ్లు లేకపోవడం మరియు యాప్ డౌన్‌లోడ్ కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుండి బస్తాలు దిగుమతి చేసుకునే సమయంలో ఒకసారి, ఈ-పోస్ యంత్రాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేటప్పుడు మరోసారి స్కాన్ చేయాల్సి రావడం వల్ల సమయం తీవ్రంగా వృధా అవుతోందన్నారు.




