Rayachoti: రాయచోటిలో చైల్డ్ హెల్ప్‌లైన్‌పై విద్యార్థులకు అవగాహన

Rayachoti: రాయచోటి రాయుడు కాలనీ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, 112 టోల్ ఫ్రీ నంబర్లు, మిషన్ వాత్సల్య పథకాలపై అవగాహన కల్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 6:36 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో చైల్డ్ హెల్ప్‌లైన్‌పై విద్యార్థులకు అవగాహన

Rayachoti: జిల్లా శిశు సంక్షేమ మరియు సాధికారత జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మరియుమిషన్ వాస్తల్య ఆధ్యరంలో అన్నమయ్య జిల్లా రాయచోటి రాయుడు కాలనీ లో మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు 1098, 112 టోల్ ఫ్రీ నెంబర్ల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది ఇర్షాద్ మాట్లాడుతూ నేటి బాల బాలికల పరిరక్షణకు సంబంధించిన చర్యలకు 1098, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు.

0 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమాచారం ఇవ్వాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే దత్తతకు అప్లై చేసుకోవచ్చునని వివరించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల గురించి కూడా వివరించారు. ఇచ్చే స్కాలర్షిప్ మూడు సంవత్సరాలు మాత్రమే వస్తుంది అని వివరించారు. ఇందులో స్కూల్ హెడ్ మాస్టర్ షోకత్ అలీ , ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI