Rayachoty: రాయచోటి తహసిల్దార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: ధరల పెంపుపై సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, న్యూ డెమోక్రసీ భారీ నిరసన!

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

RAMESH KUMAR RAJU, ROYCHOTI
Published on: 9 Jun 2026 9:42 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి తహసిల్దార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: ధరల పెంపుపై సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, న్యూ డెమోక్రసీ భారీ నిరసన!

రాయచోటి / అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాయచోటి స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ ) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వై వి శివయ్య లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని వారు ఎద్దేవాచేశారు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు అమాంతంగా నాలుగు సార్లు పెంచుకుంటూ పోవడం కేంద్ర ప్రభుత్వం పనిగా పట్టుకున్నదని వారు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న దాడిని ప్రజలు తిప్పి కొట్టాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడమే పనిగా పెట్టుకున్నదని అన్నారు రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు విమర్శించారు వెంటనే పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు మాధవరం గ్రామం. ఇన్ చార్జీ మల్లికార్జున నాయుడు సుజాత సుబ్బమ్మ ‌ P D S U జిల్లా నాయకులు శెట్టిపల్లి సాయికుమార్, దుర్గాప్రసాద్, ఏఐసిసి టీ యూ నాయకులు వీరభద్ర తదితరులు పాల్గొన్నారు

RAMESH KUMAR RAJU, ROYCHOTI

RAMESH KUMAR RAJU, ROYCHOTI

Next Story