Palamaner: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమం
Palamaner: పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
Palamaner: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమం
పలమనేరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెడికల్ సూపర్నెంట్ మమతారాణి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది చనిపోయారని దీనికి కారణం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవడమే అని తెలిపారు ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని చూపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో భవాని మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందని కాలుష్యాన్ని నిర్మూలించి పచ్చదనని పెంపొందించాలని తెలిపారు మరో అతిథిగా హాజరైన ఎఫ్ ఆర్ ఓ చాంప్లా నాయక్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం 2.5 కోట్ల సీడింగ్ రెడీ చేస్తున్నట్లు అటవీ ప్రాంతాల పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.




