Madanapalle: భూ మోసం భగ్నం: సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి అప్రమత్తత!

Madanapalle: నకిలీ పత్రాలతో రూ. 50 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించిన ముగ్గురిపై సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 13 July 2026 12:25 AM IST
Madanapalle
X

Madanapalle: భూ మోసం భగ్నం: సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి అప్రమత్తత!

మదనపల్లె: మదనపల్లెలో నకిలీ పత్రాల ఆధారంగా సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు చేసిన యత్నం అధికారుల అప్రమత్తతతో భగ్నమైంది.

బండమీదకమ్మపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 303/1కు చెందిన భూమి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన పత్రాలను సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలనలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర కీలక పత్రాలు నకిలీవని గుర్తించారు. అనంతరం ఈసీ (ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్) ద్వారా వివరాలు పరిశీలించగా, భూమి అసలు యజమానులు నరసిపురం రవీంద్రనాథ్, ఆయన భార్య అని నిర్ధారణ అయింది.

దీంతో సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సరస్వతమ్మ, వెంగళ ఉమానరేష్, బాల గణేష్ అలియాస్ రాయల్ గనిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ పత్రాలతో విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు చేసిన ఈ యత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story