Tirupati: తనపల్లెలో ఉచిత చలివేంద్రం ప్రారంభించిన రాజేష్ ఫౌండేషన్

Tirupati: తనపల్లెలో రొమ్ముల రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ ప్రారంభమైంది.

K VENU, TIRUPATHI RURAL
Published on: 11 May 2026 1:21 PM IST
Tirupati
X

Tirupati

Tirupati: తిరుపతి రూరల్ (మండలం) తనపల్లెలో రొమ్ముల రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభమైంది.. వేసవి సందర్భంగా స్థానిక ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలగకుండా శుద్ధి చేసిన మంచినీరు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఉచితంగా పంపిణీ చేపట్టారు. రొమ్ముల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రొమ్ముల రాజేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజేష్ మండుతున్న ఎండలు దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఉచితంగా హెల్మెట్ల, ఉచితపెట్రోల్, వంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థుల కోసం పలురకాల సేవా కార్యక్రమాలు రొమ్ములలో ఫౌండేషన్ తరపున చేపట్టారు. తాజాగా మరో సేవా కార్యక్రమం తో ప్రజల ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. వేసవికాలం మురిసే వరకు ఉచిత చలివేంద్ర ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు రాజేష్ సేవా కార్యక్రమాలను అభినందించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story