Chittoor: చిత్తూరులో వైభవంగా సంపద వినాయక స్వామి వేడుకలు!
Chittoor: చిత్తూరు నగరం 75 దొడ్డిపల్లి రాముల గుడి వీధిలో ఘనంగా సంపద వినాయక నవరాత్రులు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైయస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డి.
Chittoor: చిత్తూరులో వైభవంగా సంపద వినాయక స్వామి వేడుకలు!
Chittoor: నగరంలోని 75 దొడ్డిపల్లి రాముల గుడి వీధి లో సంపద వినాయక స్వామి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకి వినాయక మండపానికి తెర తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా వైసిపి చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎం.సి. విజయానందరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లోకానందం, దొరైరాజ్, దిలీప్‌కుమార్, రాజేష్, చొక్కలింగం, కరుణాకర్, ఉదయ్‌చందర్, భువనేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న అన్నదానం,18న డ్యాన్స్ కార్యక్రమం, 20న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




