Chittoor: తొట్టంబేడు మండలంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. రైతుల తిరుగుబాటు

Chittoor: తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 13 Jun 2026 7:46 PM IST
Chittoor
X

Chittoor: తొట్టంబేడు మండలంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. రైతుల తిరుగుబాటు

Chittoor: తొట్టంబేడు మండలం పూడి గ్రామ పరిధిలోని పంట పొలాల వద్ద ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అక్రమ ఇసుక రవాణా కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ రైతులు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న సుమారు 25 ఇసుక ట్రాక్టర్లను పూడి గ్రామ జడ్పీ హైస్కూల్ ఆవరణలో బంధించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతుల పంట భూములను పరిరక్షించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.

ఘటన విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story