Madanapalle: మదనపల్లెలో శశికుమార్ రాయల్ జన్మదినం సందర్భంగా అన్నదానం

Madanapalle: కురవంక మాజీ సర్పంచ్ కుమారుడు శశికుమార్ రాయల్ పుట్టినరోజు వేడుకలు. వెలుగు పాఠశాలలో వృద్ధులు, వికలాంగులకు అన్నదానం, పండ్ల పంపిణీ.

Srinivasulu, Madanapalle
Published on: 30 Jun 2026 11:47 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో శశికుమార్ రాయల్ జన్మదినం సందర్భంగా అన్నదానం

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి తనయుడు పసుపులేటి శశికుమార్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అమ్మచెరువు మిట్టలోని వెలుగు పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని వికలాంగులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలను ఆర్భాటంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కనుకొండ, గిరిజా సాయి శేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని శశికుమార్ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని (పి.ఎస్.ఆర్) గ్రూప్ అక్క లక్ష్మీ ప్రసన్న, బావ శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

వికలాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story