ISRO: ఇస్రో కీలక నిర్ణయం.. 'షార్' కొత్త బాస్ ముత్తుచెళియన్!

ISRO: శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డైరెక్టర్‌గా ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త ఎస్. ముత్తుచెళియన్ నియమితులయ్యారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 2 Jun 2026 8:13 PM IST
ISRO
X

ISRO: ఇస్రో కీలక నిర్ణయం.. 'షార్' కొత్త బాస్ ముత్తుచెళియన్!

ISRO: ​తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ఎస్. ముత్తుచెళియన్ నియమితులయ్యారు. ప్రస్తుతం అసోసియేట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, మే 31న పదవీ విరమణ పొందిన ఈ.ఎస్. పద్మకుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడుకు చెందిన ఎస్. ముత్తుచెళియన్, 1967 జూలై 13న జన్మించారు. 1991లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఇస్రోలో చేరిన ఆయన, మూడు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో విశేష సేవలు అందించారు. ప్రయోగ వాహనాల అభివృద్ధి, ప్రయోగాల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రస్తుతం షార్ అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలోనే అత్యంత8 కీలకమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా పేరుగాంచిన శ్రీహరికోట షార్‌కు డైరెక్టర్‌గా ఆయన నియామకం కావడం, ఇస్రో వర్గాల్లో హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన మాజీ డైరెక్టర్ ఈ.ఎస్. పద్మకుమార్‌ను ఎస్. ముత్తుచెళియన్ మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల విజయవంతమైన నిర్వహణలో ఆయన అనుభవం, నాయకత్వం మరింత దోహదపడనున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story