Madanapalle: మదనపల్లె 37వ వార్డులో శేషాచలపతి నాయుడు ఘనవిజయం
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 37వ వార్డు కౌన్సిలర్‌గా శేషాచలపతి నాయుడు 310 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వార్డును ఆదర్శంగా నిలుపుతామని చంద్రశేఖర్ తెలిపారు.
Madanapalle: మదనపల్లె 37వ వార్డులో శేషాచలపతి నాయుడు ఘనవిజయం
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 37వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి శేషాచలపతి నాయుడు 310 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా లైఫ్ కేర్ రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. శేషాచలపతి నాయుడును భారీ మెజారిటీతో గెలిపించిన 37వ వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
వార్డు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో 37వ వార్డును నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రేగడి ప్రసాద్, స్నేహితులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.




