Ramasamudram: దీన్నేపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు!
Ramasamudram: అన్నమయ్య జిల్లా దీన్నేపల్లిలో ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించి, హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు.
Ramasamudram: దీన్నేపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు!
Ramasamudram: మండలంలోని ఉలపాడు పంచాయతీ పరిధిలోని దీన్నేపల్లి గ్రామంలో రామసముద్రం ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులకు ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్సై హృషికేశవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Next Story




