Punganur: ICCSWE ఏపీ వైస్ ప్రెసిడెంట్గా చౌడేపల్లికి చెందిన సోమజ
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోమజ దేవతనేని ప్రతిష్టాత్మక ICCSWE ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
Punganur: ICCSWE ఏపీ వైస్ ప్రెసిడెంట్గా చౌడేపల్లికి చెందిన సోమజ
Punganur: ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్గా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం నుంజార్లపల్లికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోమజ దేవతనేని నియమితులయ్యారు. ఈ మేరకు ఐసీసీఎస్డబ్ల్యూఈ జాతీయ సంయుక్త కార్యదర్శి (అడ్మిన్) సీమా కిరణ్ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుండి నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి, వారి సాధికారత, మరియు వ్యాపార రంగంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆమె ఈ పదవిలో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
తన నియామకం పట్ల సోమజ దేవతనేని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తల బలోపేతానికి, వారి ఎదుగుదలకు తన శాయశక్తులా కృషి చేస్తానని, ఈ అవకాశం కల్పించిన ఐసీసీఎస్డబ్ల్యూఈ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆమె నియామకం పట్ల స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.




