Madanapalle: మదనపల్లెలో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు!
Madanapalle: మదనపల్లె మండలం గాజులవారిపల్లెలో దారుణం. మద్యం తాగి గొడవ చేస్తున్న తండ్రి సహదేవను కొట్టి చంపిన కుమారుడు సంతోష్. కేసు నమోదు చేసిన పోలీసులు.
Madanapalle: మదనపల్లెలో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు!
Madanapalle: మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సహదేవ (మంగళవారం) రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సహదేవ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడని, ఈ క్రమంలో ఆయన కుమారుడు సంతోష్ తీవ్రంగా కొట్టడంతో సహదేవ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




