Punganur: పుంగనూరు సమీపంలో అట్టహాసంగా చౌడేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు!

Punganur: పుంగనూరు పరిధిలోని చదళ్ళ శ్రీ చౌడేశ్వరి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రత్యేక పూజలు మరియు అన్నదాన వితరణ.

MAHESH, PUNGANOOR
Published on: 19 Oct 2026 6:51 PM IST
Punganur
X

Punganur: పుంగనూరు సమీపంలో అట్టహాసంగా చౌడేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు!

Punganur: అన్నమయ్య చిత్తూరు జిల్లాల పరిధిలోని అత్యంత వైభవంగా జరుగుతున్న చదల్లా శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి నవరాత్రి ఉత్సవాలు రోజురోజుకు జగజయమానమై వెలుగొందుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ చండి రూపంలో భక్తుల మనో, వాస్తవ వికారాలను అపజయాలను బాధలను కష్టాలను పేడలను సకల దుష్టశక్తుల ప్రభావాలను తొలగించే మహోజ్వల రూపమై,ఉగ్రమై, భీకరమై దర్శనమిచ్చారు. అమ్మవారి స్మరణ మాత్రమే భయాలు తొలగిపోతాయని, తల్లిదయ ఉంటే విజయాలు వరిస్తాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో తెల్లవారి నుంచి ఆలయంలో వేద పండితులు వేద పూజలు వివిధ సుగంధ ద్రవ్యాల అభిషేకాలు పంచామృత అభిషేకాలు నిర్వహించి శ్రీ చండీ అమ్మవారి ప్రీతి కోసం పలు హోమాలను ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఉషశ్రీ దంపతుల సారధ్యంలో నిర్వహించారు. శ్రీ చండీ రూపంలో దర్శనం ఇచ్చిన శ్రీ చౌడేశ్వరి మాతను పరిసర గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు దర్శించి తరించారు భక్తులకు చదల్లా గ్రామస్తులు ఎన్విఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగింది. మంగళవారం ఉత్సవాల చివరి రోజు అమ్మవారిని శ్రీ చౌడేశ్వరి అలంకరణలో అత్యంత వైభవంగా కైంకర్యాలు చేసి, అమ్మవారి ఉత్సవ మూర్తిని చదల్లా గ్రామంలో ఊరేగించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR