Srikalahasti: విష్ణు కెమికల్స్ కార్మికుల క్వార్టర్స్‌లో కార్డన్ అండ్ సెర్చ్

Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు కెమికల్స్ కార్మికుల క్వార్టర్స్‌లో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 12 July 2026 8:53 AM IST
Srikalahasti
X

Srikalahasti: విష్ణు కెమికల్స్ కార్మికుల క్వార్టర్స్‌లో కార్డన్ అండ్ సెర్చ్

Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం విష్ణు కెమికల్స్ ఇండస్ట్రీకి చెందిన కార్మికుల నివాస గృహాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లేబర్ క్వార్టర్స్‌లోని అన్ని గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అనంతరం కార్మికులతో సమావేశం నిర్వహించిన పోలీసులు... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

మాదక ద్రవ్యాల వినియోగం, వాటిని కలిగి ఉండటం, అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story