Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో బస్సుల వినియోగంపై వివాదం
Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు బస్సులు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా నీటి క్యాన్ల రవాణాకు బస్సు వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Srikalahasti
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో బస్సుల వినియోగంపై వివాదం నెలకొంది. ప్రయాణికులకు అవసరమైన సమయంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తిరుపతికి వెళ్లే బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్న సమయంలో, డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును నీటి క్యాన్ల రవాణాకు ఉపయోగించినట్లు ఆరోపణలు వినిపించాయి. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద బస్సులో నీటి క్యాన్లు ఎక్కించి సుమారు గంటపాటు నిలిపివేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.
డిపో మేనేజర్ సొంత ప్రయోజనాల కోసం బస్సులను వినియోగిస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తూ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఆర్టీసీ డీఎంను వివరణ కోరగా, డిపో పరిధిలో మెడికల్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో నీటి సరఫరా కోసం బస్సును వినియోగించినట్లు తెలిపారు. నీటి క్యాన్లు తరలిస్తున్న సిబ్బంది కూడా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులోనే నీరు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.




