Sri Kalahasti: వైఎస్‌ఆర్‌సీపీ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
Sri Kalahasti: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించారు.
Sri Kalahasti: వైఎస్‌ఆర్‌సీపీ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
Sri Kalahasti: శ్రీకాళహస్తి లో వైసీపీ నేతల ర్యాలీ,ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి ర్యాలీ. డీఎస్సీ లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టిన వైసీపీ కేడర్.
ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నాయకులకు పోలీసుల సూచనలు. పట్టణ ప్రజలకు,ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ర్యాలీలు ,సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపిన పట్టణ పోలీసులు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మధు.
ముఖ్యమంత్రి చంద్రబాబు , నారా లోకేశ్ పై ఆగ్రహం వ్యక్తం. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే సీబీఐ తోఎంక్వయిరీ జరిపించాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నార లోకేష్ రాజీనామా చెయ్యాలి.
జగన్ పై విమర్శలు చేసేముందు టిడిపి నేత బోండా ఉమ ఒళ్ళు దెగ్గర పెట్టుకొని మాట్లాడు. జగన్ పై అవక్కులు చవాకులు మాట్లాడి తొడలు కొడితే నీకు బాగుండదు బోండా ఉమ అంటూ గాటు వ్యాఖ్యలు. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించిన మావిఘాన్ సిటీ ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించారు. చివరకు జగన్ చెప్పిన మావిగన్ సిటీ లోని ప్రాంతాలనే చంద్రబాబు రాజధానిగా చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
చంద్రబాబు నాయుడుకు నేనే అంతర్గత సలహా దారుడుని అయ్యి ఉంటే అమరావతి గురించి ఒక మంచి సలహా ఇచ్చేవాడిని.ఇటలీ లో వాటర్ సిటీ అనే పర్యాటక ప్రాంతం ఉంది. ఆప్రాంతంలో నీటిపైనే భవనాలు నిర్మించారు.
ఆ వాటర్ సిటీనీ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేవాళ్ళు. ఆ పర్యాటకుల వలనే 10 వేలకోట్ల రూపాయల ఆదాయం అక్కడి ప్రభుత్వానికి వస్తుంది. అలాగే అమరావతి నీకూడా వాటర్ సిటీ రాజధానిగా చంద్రబాబు ప్రకటించాలి.
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అమరావతిలో రిసార్టులు, మసాజ్ సెంటర్లు, క్యాసినో లు ఏర్పాటుచేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది అంటూ వ్యంగ్గంగా వ్యాఖ్యలు చేసిన మధు సూదన్ రెడ్డి.




