Madanapalle: దివంగత పెద్దప్పన్న భౌతికకాయానికి శ్రీరామ్ చినబాబు నివాళి
Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.
Madanapalle: దివంగత పెద్దప్పన్న భౌతికకాయానికి శ్రీరామ్ చినబాబు నివాళి
దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) గారికి శ్రీరామ్ చినబాబు నివాళి
మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం ఉంటున్న దివంగత శ్రీ అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) గారి నివాసానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విచ్చేసి, వారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత పెద్దప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్దప్పన్న సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోడెమ్ సిద్ధప్ప, మంజు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొని దివంగత పెద్దప్పన్నకు ఘనంగా నివాళులర్పించారు.




